Thursday, November 1, 2007

half knowledge is dangerous

ఈవిడ ఈమధ్య ఒకటి రెండు సొంత రాతలు కూడా రాసిందండోయ్(అలా చెప్పుకుంది).
అవి చదివితే ఆవిడ మిగతా కాపీ లకి వీటికీ తేడా మీకే తెలుస్తుంది. ఓ శైలీ లేదు పదాల పొందికా లేదు. అది పోని దాంట్లో సరుకూ లేదు, అన్ని కారు కూతలూ ,వెకిలి మాటలూ ,సగం నాలెడ్జీ వేషాలు, ఏదో పొడిచేస్తున్నానన్న ఫీలింగ్ తప్ప ఏమీ లేదు. ఎవరికీ ఉపయోగం లేని ఈ చెత్త ఈవిడ రాయటం భజన గాళ్ళు తాళం వేయటం. వాఖ్యల పేజీ నిండా వేరే వాళ్లకి స్థలం లేకుండా ఈ భజన కామెంట్లే. నాన్సెన్స్ తూ, తూ మీలో ఒక్కరన్నా ఇది పద్దతి కాదని చెప్పరా?.

1 comment:

saiabhay said...

నిజంగా తెలుగు సాహిత్యానికి గడ్డు రోజులు వచ్చాయి.పత్రికలు, బ్లాగుల పుణ్యమా అని రాచిన చెత్త అంతటినీ పాఠకుల మీదకు వదిలెయ్య వచ్చు. ఈ మధ్య వస్తున్న కవితల నాణ్యతను చూస్తుంటే చాలా బాధ కలుగుతొంది. మనము మాట్లాడుకునే విషయాలను, పదాలను అటు నూంచి ఇటుకు తిప్పి లైన్ల క్రింది విభజించి కవితల రూపంలో తయారు చేస్తున్నారు. మరి కొందరు పాత నవలల నుండి వ్యాక్యాలను యధాతధంగా కాపీ కొట్టి కవితలగా తయారు చేస్తున్నారు. మంచి కధకుడికి లేదా కవికి భావుకత అవసరం. భాషపై మంచి పట్టు వుండాలి అంటే బాగా చదివి వుండాలి.అప్పుడే నాణ్యమైన కవితలను రాయడం సాధ్యం.కాని ప్రస్తుత స్పీడ్ యుగంలొ అయిదు నిమిషాలోనె కవితలను తయారు చేసెస్తున్నారు అంటే వాటి నాణ్యత మరి ఎలా తగలబడుతుందో ఇట్టే ఊహించుకోవచ్చు. హృదయం లోంచి వచ్చే ఆలోచనలకు పదాల రూపు నిస్తే ఒక మంచి కవిత కింద రూపు దిద్దుకుంటుంది. దానిని చదివితే మనసు పరవసింపజేస్తుంది. రాసిన వాడికే తన కవిత చదివె ధైర్యం లేక పోతే మరి మిగితా పాఠకులకు ఎక్కడి నూండి వస్తుంది ? అందుకే నవ తరం కవుల్లారా! ముందు సాహిత్యాన్ని బాగా చదవండి. సమకాలీన మరియు పాత తరం కవుల పద్ధతులను ఆకళింపు చేసుకొనండి.మీకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకోండి. మనష్యులను కదిలించే రచనలు రావాలంటే ముందు మీ ఋదయం స్పందించాలి.బీటలు పట్టిపోతున్న తెలుగు సాహిత్యాన్ని పరరక్షించ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది.